అది సెక్స్ సీన్ కాదు.. మ్యారిటల్ రేప్: మెహ్రీన్ పిర్జాదా
- సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ పై విమర్శలకు కౌంటర్ ఇచ్చిన నటి
- దారుణమైన రేప్ ను సెక్స్ సీన్లుగా వర్ణించడం బాధేస్తోందని వెల్లడి
- కథలో భాగంగా నటించానని, తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని వివరణ
కొన్ని కథలు అలాంటి సన్నివేశాలను డిమాండ్ చేస్తాయని, కథలో భాగంగానే వాటిని చేయాల్సి వస్తుందని మెహ్రీన్ చెప్పింది. ఓ యాక్టర్ గా కథలో భాగంగా వచ్చే సన్నివేశాలలో నటించడం తన విధి అని తెలిపింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో నటించడానికి తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని వివరించింది. అయితే, మ్యారిటల్ రేప్ ను సూచించే సన్నివేశాన్ని సెక్స్ సీన్లుగా ఎలా అంటారని మెహ్రీన్ మండిపడింది. మీ ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతారా? అంటూ ట్విట్టర్ వేదికగా మెహ్రీన్ ప్రశ్నించింది.