సతీసమేతంగా ప్రగతి భవన్ కు పొన్నాల... సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్
- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల
- నిన్న పొన్నాల నివాసానికి వెళ్లిన కేటీఆర్
- బీఆర్ఎస్ లోకి రావాలంటూ ఆహ్వానం
- ముందు కేసీఆర్ తో మాట్లాడాల్సి ఉందన్న పొన్నాల
- నేడు కేసీఆర్ తో పొన్నాల సమావేశం
తన అర్ధాంగితో కలిసి పొన్నాల నేడు ప్రగతి భవన్ కు విచ్చేశారు. పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారితో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. పొన్నాలతో కాసేపు ముచ్చటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కేశవరావు, దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు.
నిన్న కేటీఆర్ ప్రతిపాదనకు పొన్నాల సానుకూలంగానే స్పందించారన్న నేపథ్యంలో, రేపటి జనగామ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.