BRS: నిరుపేద మహిళలకు నెలకు రూ. 3 వేల జీవనభృతి.. నేడు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల

  • పూర్తి జనరంజకంగా మ్యానిఫెస్టో తయారీ
  • రైతుబీమా కింద ఇస్తున్న రూ. 5 లక్షల పరిహారం అందరికీ వర్తింపు
  • పింఛన్ రూ. 3,016కు పెంపు
  • రైతుబంధు రూ. 16 వేలకు పెంపు
  • ప్రతి సీజన్‌లో రెండు బస్తాల యూరియా ఉచితం
  • వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 400 వరకు సబ్సిడీ
BRS to release manifesto today

తమ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవడం ఖాయమని గత కొన్ని రోజులుగా చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ నేడు దానిని విడుదల చేయబోతోంది. దీనిని పూర్తి జనరంజకంగా తయారుచేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, హ్యాట్రిక్ సీఎంగా పేరు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ మ్యానిఫెస్టోను పకడ్బందీగా తయారుచేసినట్టు సమాచారం.

బయటకు వచ్చిన వివరాల ప్రకారం..
ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబీమా పరిహారం రూ. 5 లక్షలను రాష్ట్రంలోని 90 లక్షల పేద కుటుంబాలకు వర్తింపజేయనున్నారు. నిరుపేద మహిళలకు జీవనభృతిగా ప్రతినెల రూ. 3000 అందిస్తారు. ఇప్పటికే పెన్షన్ అందుతున్న మహిళలను ఇందులోంచి మినహాయిస్తారు. అలాగే, ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర వారికి  ప్రస్తుతం అందిస్తున్న రూ. 2,016 పింఛన్‌ను రూ. 3,016కు పెంచుతారు. 

జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ పథకం, రైతుబంధు సాయం రూ. 16 వేలకు పెంపు, ప్రతి సీజన్‌లో ఉచితంగా ఎకరానికి రెండు బస్తాల యూరియా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఇస్తున్న ఆర్థికసాయం రూ. 1.25 లక్షలకు పెంపు, వంట గ్యాస్ సిలిండర్లపై రూ. 400 వరకు సబ్సిడీ, మహిళలకు రూ. 2 లక్షల మేర వడ్డీలేని రుణాలు, ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, పెంట్రోలు, డీజిల్ ధరలపై రాష్ట్ర పన్ను వాటా కొంత మేర తగ్గింపు వంటివి ఉన్నాయి.

More Telugu News