Harish Shankar: 'పొలిమేర 2' ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది .. హరీశ్ శంకర్!

  • సత్యం రాజేశ్ హీరోగా 'మా ఊరి పొలిమేర 2'
  • క్షుద్రశక్తుల నేపథ్యంలో నడిచే కథ
  • కొంతసేపటి క్రితం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 
  • నవంబర్ 3వ తేదీన సినిమా రిలీజ్

Polimera 2 movie trailer launch event

సత్యం రాజేశ్ హీరోగా రూపొందిన 'మా ఊరి పొలిమేర' నవంబర్ 3వ తేదీన విడుదల కానుంది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటుకి హీరో కార్తికేయ .. నిర్మాత బన్నీ వాసు .. దర్శకుడు హరీశ్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ వేదికపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ "నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు పరిచయమైన మొదటి ఐదుగురు వ్యక్తులలో సత్యం రాజేశ్ ఒకరు. ఆయన నటించిన 'మా ఊరి పొలిమేర'ను థియేటర్లలో రిలీజ్ చేయాలనుకోవడం మంచి నిర్ణయం. ఈ సినిమా చూసినప్పుడు ఇది థియేటర్లో చూస్తేనే బాగుంటుందని నాకు అనిపించింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది" అన్నారు. 


"బన్నీ వాసు సినిమాలు తీసినా .. కొన్నా .. ఆ జెండాను నా భుజాలపై పెడుతున్నాడు. సాధారణంగా ఇండస్ట్రీలో ఫ్లాప్ అవస్థే ఫోన్లు కూడా ఎత్తరు. అలాంటి పరిస్థితుల్లో నన్ను గుర్తుపెట్టుకుని ఓ ఫంక్షన్ కి పిలిచాడు. అప్పటి నుంచి మా మధ్య స్నేహం ఏర్పడింది. అది ఈ రోజున ఇక్కడి వరకూ వచ్చింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని భావిస్తున్నాను" అని చెప్పారు.

More Telugu News