వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
  • అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావం
  • 125 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 42 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు నష్టపోయి 66,282కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 19,751 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (4.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.55%), నెస్లే ఇండియా (2.00%), మారుతి (1.62%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.33%), ఇన్ఫోసిస్ (-2.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.71%), విప్రో (-1.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.85%).   

Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News