సినిమా అనేది నా డీఎన్ఏలోనే ఉంది: మహేశ్ బాబు కూతురు

  • తన తాత ఘనమైన వారసత్వం ఇచ్చి వెళ్లారన్న సితార
  • తన తండ్రి మహేశ్ బాబును సిల్వర్ స్క్రీన్ టైటాన్ గా అభివర్ణన 
  • తన జీవితంలో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రకటన
ప్రముఖ నటుడు మహేశ్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తన తండ్రిని ఎంతగానో ప్రశంసించింది. సిల్వర్ స్క్రీన్ పై టైటాన్ గా తన తండ్రిని అభివర్ణించింది. శుక్రవారం ఘట్టమనేని సితార ఇన్ స్టా గ్రామ్ లో తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసింది. ఈ ఫొటోలో సూపర్ స్టార్ కృష్ణతోపాటు మహేశ్ బాబు, నమ్రత, గౌతమ్, సితార ఉండడాన్ని చూడొచ్చు.

తన తాత కృష్ణ ప్రభావం తమ అందరిపైనా ఉంటుందని సితార తన పోస్ట్ లో పేర్కొంది. ఈ ఘనమైన వారసత్వంలో భాగమైనందుకు ధన్యవాదాలు తెలియజేసింది. ‘‘సినిమా అనే పదానికి నా జీవితంలో, నా ఎదుగుదలలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇది నాకు కేవలం పరిశ్రమ కాదు. నా డీఎన్ఏ లోనే భాగం. వెండితెర టైటాన్ పట్ల తన తండ్రి (కృష్ణ) ఎలా ఉండేవారో.. నాకు కూడా నా తండ్రి ఎప్పుడూ స్ఫూర్తినీయం. మా తాతగారు ప్రపంచానికి లెజెండరీగా, సూపర్ స్టార్ కృష్ణగా సుపరిచయం. మా అందరిపై ఎంతో ప్రభావం చూపించిన వ్యక్తి. ఆయన నా తండ్రి, నా సోదరుడు, నాకు ఇచ్చి వెళ్లిన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడతున్నాను’’ అని సితార ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Mahesh Babu
daughter
Sitara Ghattamaneni
emotional post

More Telugu News