చంద్రబాబు, పవన్ పై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరిందని స్పష్టమవుతోంది: లోకేశ్
- సీఎం జగన్ పై లోకేశ్ విమర్శనాస్త్రాలు
- నాలుగున్నరేళ్లుగా సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదని విమర్శ
- జగన్ కు అధికార మదం ఎక్కిందని వ్యాఖ్యలు
లోటు బడ్జెట్ తో ఏర్పడిన నవ్యాంధ్రను ఏ లోటూ లేకుండా అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారా? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పిచ్చి జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి 73 ఏళ్ల చంద్రబాబును నెల రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని ఆరోపించారు.