ఇజ్రాయెల్ లో చిక్కుకున్న మన వాళ్లను రప్పించేందుకు 'ఆపరేషన్ అజయ్' ప్రారంభం
- ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం
- ఇజ్రాయెల్ లో పెద్ద సంఖ్యలో చిక్కుకున్న భారతీయులు
- ఈరోజు నుంచే ఆపరేషన్ అజయ్ ప్రారంభం
ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. మన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. ఈ రోజు నుంచే ఆపరేషన్ అజయ్ ప్రారంభం అవుతుందని ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం అధికార ప్రకటన చేసింది. గతంలో ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను రప్పించేందుకు కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టిన సంగతి తెలిసిందే.