ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి బాజాలు
- జనవరి 3న కుమార్తె ఇరాఖాన్ వివాహం
- తేదీని ప్రకటించిన అమీర్ ఖాన్
- నుపుర్ తనకు కుమారుడితో సమానమని ప్రకటన
2024 జనవరి 3న కుమార్తె వివాహం జరగనున్నట్టు ఆయన ప్రకటించారు. న్యూస్18కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమిర్ దీనిపై స్పందించారు. ‘‘ఇరా జనవరి 3న వివాహం చేసుకోబోతోంది. అతడి పేరు నుపుర్. అతడో లవ్ లీ బోయ్. ఇరా మానసికంగా కుంగుబాటు చెందుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచాడు. ఆమెకు తోడుగా, మద్దతుగా నిలిచిన వ్యక్తి. వారు కలసి ఎంతో సంతోషంగా ఉన్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. వారు ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకోగలరు’’ అని ఆమిర్ ఖాన్ తెలిపారు. నుపుర్ తనకు కుమారుడితో సమానమని ఆమిర్ పేర్కొన్నారు. అతడ్ని తమ కుటుంబ సభ్యుడిగానే భావిస్తున్నట్టు చెప్పారు. నుపుర్ తల్లి ప్రీతమ్ జీ ఇప్పటికే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని పేర్కొన్నారు.