ఉచిత హామీలపై సీఈసీ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
- గెలిచాక ఏం చేస్తామో చెప్పే స్వేచ్ఛ పార్టీలకు ఉందని వెల్లడి
- ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందన్న సీఈసీ
- ఎన్నికల హామీలను ఐదేళ్ల పాటు పార్టీలు గుర్తుంచుకోవట్లేదని ఆరోపణ
అధికారంలోకి రావడం కోసం అమలు చేయడం సాధ్యం కాని హామీల వరాలను కురిపిస్తాయని చెప్పారు. ఇలాంటి హామీలను నియంత్రించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీఈసీ స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలోగా, ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిందిగా ఒక నిర్ణీత నమూనాను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో గెలిచాక ఏంచేయబోయేది చెప్పే స్వేచ్ఛ పార్టీలకు ఉందని, అదేవిధంగా ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు.