Rajiv Gandhi International Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు

  • విమానాశ్రయానికి బెదిరింపు ఈ-మెయిల్
  • విమానాన్ని హైజాక్ చేస్తామంటూ ఆగంతుకుడి హెచ్చరిక
  • దుబాయ్ వెళ్లే విమానం సర్వీసు రద్దు, హోటల్‌కు ప్రయాణికుల తరలింపు
  • ఇప్పటికే ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు 
Shamshabad airport receives hijack threat mail dubai flight service suspended

విమానం హైజాక్ చేస్తామని బెదిరిస్తూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తాజాగా ఈ-మెయిల్ రావడం కలకలానికి దారి తీసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లే ఓ విమానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News