రైలు ప్రయాణికులకు గమనిక.. ఈ రూట్లలో 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

08-10-2023 Sun 09:56 | Andhra
Advertisement
  • విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు
  • ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు
  • మరికొన్ని రైళ్లు దారిమళ్లింపు
Advertisement
విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా  రద్దు చేసింది.

విజయవాడ-తెనాలి (07279) రైలును రేపటి నుంచి 15వ తేదీ వరకు రద్దు చేయగా, తెనాలి-విజయవాడ (07575) రైలును కూడా అదే తేదీల్లో రద్దు చేశారు. బిట్రగుంట-విజయవాడ (07977/07978) రైలు 11వ తేదీ నుంచి 15 వరకు, బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237/17238)  రైలును రేపటి నుంచి 13 వరకు, విజయవాడ- ఒంగోలు (07461) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు రద్దు చేశారు. ఒంగోలు- విజయవాడ (07576) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, విజయవాడ- గూడూరు (17259/17260) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు,  విజయవాడ- గూడూరు(07500) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు, గూడూరు- విజయవాడ (07458) రైలును 12వ తేదీ నుంచి 16 వరకు, రాజమండ్రి- విశాఖపట్టణం (07466/07467) రైలును రేపటి నుంచి 15 వరకు, గుంటూరు- విశాఖపట్టణం (17239/17240) రైలును రేపటి నుంచి 16వరకు,  విజయవాడ- విశాఖపట్టణం (22701/22702) రైలును 9,10,11,13,14 తేదీల్లో రద్దు చేశారు. రాజమండ్రి- విజయవాడ (07767) రైలును 9వ తేదీ నుంచి 15 వరకు,  విజయవాడ- రాజమండ్రి (07459) రైలును రేపటి నుంచి 15వరకు, మచిలీపట్టణం- విశాఖపట్నం (17219/17220) రైలును రేపటి నుంచి 16వరకు, విజయవాడ- గూడూరు (12743/12744) రైలును 11వ తేదీ నుంచి 16వరకు పూర్తిగా రద్దు చేశారు.
 
పాక్షికంగా రద్దు అయిన రైళ్లలో.. నర్సాపూర్-గుంటూరు (17281/17282) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దు చేయగా, మచిలీపట్టణం-విజయవాడ(07896) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ- మచిలీపట్నం (07769), నర్సాపూర్- విజయవాడ(07883), విజయవాడ- మచిలీపట్టణం (07866), మచిలీపట్టణం-విజయవాడ(07770), విజయవాడ- భీమవరం జంక్షన్(07283), మచిలీపట్టణం-విజయవాడ (07870), విజయవాడ- నర్సాపూర్ (07861) రైళ్లు అవే తేదీల్లో అవే రూట్ల మధ్య రద్దు చేశారు.

విజయవాడ, గుడివాడ-భీమవరం జంక్షన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లలో ధన్‌బాద్- అలెప్పి(13351) రైలును రేపటి నుంచి 13వరకు, హతీయ- బెంగుళూరు(12835) రైలును ఎల్లుండి, టాటా- బెంగుళూరు (12889) రైలును 13వతేదీ, టాటా- యశ్వంత్‌పూర్ (18111) 12వ తేదీన, హతియ- ఎర్నాకుళం (22837) రైలును 9వ తేదీన దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Advertisement
Indian RailwaysVijayawada Railway DivisionTrains Cancelled

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more