Israel: టెల్ అవీవ్ నగరానికి విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిరిండియా

  • ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడులు
  • 100 మంది మృతి
  • ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు ముఖ్యమన్న ఎయిరిండియా
Air India cancels flights to Tel Aviv

ఇజ్రాయెల్ పై హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు మెరుపుదాడులకు పాల్పడడం తెలిసిందే. హమాస్ రాకెట్ దాడులు, కాల్పుల్లో 100 మంది ఇజ్రాయెలీలు మృతి చెందినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 740 మందికి పైగా గాయాలపాలయ్యారు. 

అటు, ఇజ్రాయెల్ కూడా పాలస్తీనాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భీకరంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 198 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఎయిరిండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది. ఇజ్రాయెల్ పై హమాస్ దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాలు రద్దు చేశామని ఎయిరిండియా వెల్లడించింది.

More Telugu News