ఏపీలో ప్రజల రోగాలకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఆ ఒక్కటే కారణమన్న పీతల సుజాత!
- జగనన్న సురక్ష పథకం కాదని, ప్రజలను శిక్షించే పథకమన్న మాజీ మంత్రి
- జగన్ ప్రభుత్వం వైద్యరంగాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిందని ఆరోపణ
- ప్రజల అనారోగ్యానికి నాసిరకం మద్యమే కారణమన్న పీతల సుజాత
సురక్ష కార్యక్రమంలో విధులు నిర్వర్తించే ఆశా వర్కర్లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని కాపాడలేని ముఖ్యమంత్రి ఇక ప్రజలను రక్షిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు రోగాలపాలవ్వడానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడటానికి జగన్ అధికారంలోకి వచ్చాక అందుబాటులోకి తెచ్చిన నాసిరకం మద్యమే కారణమని ఆరోపించారు.