చంద్రబాబు అరెస్ట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- జగన్ పాలన కంటే ఉత్తరకొరియా పాలన బెటర్ అన్న విష్ణుకుమార్ రాజు
- అరెస్ట్‌తో వైసీపీపై వ్యతిరేకత, చంద్రబాబుపై సానుభూతి ఏర్పడిందని వెల్లడి
- జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందన్న విష్ణుకుమార్ రాజు
చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదన్నారు. చిత్తూరు వైసీపీ ఎంపీ చెప్పిందాంట్లో నిజం లేదన్నారు. ఇదంతా వైసీపీ కుట్ర అన్నారు. జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందని, ఆయన విధానాలు ప్రజలకు విసుగెత్తించాయన్నారు. ఏం మాట్లాడాలన్నా భయమేస్తోందని, తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారన్నారు. గతంలో కనీసం నోటీసులు ఇచ్చేవారని, ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసులో ఇరికిస్తున్నారన్నారు.
ఇంతటి రాక్షస పాలన స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా చూడలేదని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరన్నారు. జగన్ ప్రభుత్వం కంటే ఉత్తర కొరియాలో కిమ్ ప్రభుత్వం చాలా బెటర్ అని తాను భావిస్తున్నానని విమర్శించారు.