కేటీఆర్ తన ఫ్రెండ్‌కు టిక్కెట్ ఇచ్చారు, ఎలా గెలుస్తారో చూస్తా: రేఖానాయక్ కంటతడి
- బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రేఖా నాయక్
- బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదన్న ఎమ్మెల్యే
- ఏ పార్టీ తరఫున పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తానన్న రేఖానాయక్
- నన్ను ఏడిపించారు.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపిస్తానన్న ఎమ్మెల్యే
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన నియోజకవర్గానికి నిధులు ఆపేశారన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ సవాల్ చేశారు. తాను పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. తనకు అనవసరంగా టిక్కెట్ నిరాకరించారంటూ రేఖా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పుడు ఏడుస్తున్నానని, కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపించడం ఖాయమన్నారు.