కొత్త హెయిర్ స్టయిల్ తో సరికొత్తగా ధోనీ.. ఫొటోలు ఇవిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త హెయిర్ స్టయిల్ తో సరికొత్తగా ధోనీ.. ఫొటోలు ఇవిగో!

MS Dhoni new hair style
  • యాడ్ కోసం సరికొత్త లుక్ లో ధోనీ
  • పొడవు జుట్టుతో అట్రాక్టివ్ గా ఎమ్మెస్
  • పిక్స్ షేర్ చేసిన హెయిర్ స్టయిలిస్ట్ అలీమ్
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఏది చేసినా సంచలనమే. తాజాగా సరికొత్త హెయిర్ స్టయిల్ తో ధోనీ ఆకట్టుకుంటున్నాడు. హెయిర్ స్టయిల్స్ ను మార్చడం ధోనీకి కొత్తేం కాదు. ఇప్పటికి ఎన్నో రకాల హెయిర్ స్టయిల్స్ తో అభిమానులను ఉర్రూతలూగించాడు. తాజాగా ఓ యాడ్ కోసం ధోనీ హెయిర్ స్టయిల్ మార్చాడు. జుట్టును పొడవుగా పెంచి, లైట్ గా గోల్డ్ కలర్ వేసి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. కొత్త హెయిర్ స్టయిల్ తో ఉన్న ధోనీ పిక్ ను హెయిర్ స్టయిలిస్ట్ అలీమ్ హకీమ్ ఇన్స్టాలో షేర్ చేశాడు. మరోవైపు ధోనీతో పని చేయడం పట్ల అలీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ధోనీ హెయిర్ ను స్టయిల్ గా చేసేందుకు చాలా ప్లాన్ చేశానని తెలిపాడు.
Advertisement
MS Dhoni
New Hair Style

More Telugu News