లులూ మాల్ కు పోటెత్తుతున్న కస్టమర్లు... స్టాల్స్ మొత్తం ఖాళీ

03-10-2023 Tue 15:27 | Telangana
Advertisement
  • కేపీహెచ్ బీ కాలనీలో ఏర్పాటైన లులూ మాల్
  • మాల్ లో 75 దేశీ, విదేశీ బ్రాండెడ్ స్టోర్లు
  • రూ. 500 కోట్లతో మాల్ ఏర్పాటు
Advertisement
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవలే ప్రారంభమైన లులూ మాల్ కు కస్టమర్లు పోటెత్తుతున్నారు. ఈ మాల్ దెబ్బకు జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మెయిన్ రోడ్డు మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు ఇసుకవేస్తే రాలనంతగా వస్తున్న కస్టమర్లను చూసి మాల్ యాజమాన్యం సైతం విస్తుపోతోంది. బైక్ లు, కార్లు పెట్టడానికి కూడా పార్కింగ్ దొరకడం లేదు. మాల్ లోని స్టాల్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి. ఎక్కడ చూసినా చాకొలేట్ కవర్లు, ఫుడ్ కవర్లు, ఖాళీ కూల్ డ్రింక్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. 

యూఏఈకి చెందిన ఈ మాల్ ను ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ మాల్ లో 75 దేశీ, విదేశీ బ్రాండెడ్ స్టోర్లు ఉన్నాయి. సినిమా ప్రియుల కోసం 5 స్క్రీన్లు ఉన్నాయి. 1,400 మంది సినిమాలను వీక్షించే సదుపాయాలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, మొబైల్, పండ్లు, కూరగాయలు, మాంసం.. ఇలా అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. పిల్లల కోసం ఎంటర్ టైన్ మెంట్ జోన్ కూడా ఉంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ఈ మాల్ ను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే బెంగళూరు, కోయంబత్తూర్, తిరువనంతపురం, లక్నో, కొచ్చిలలో ఈ మాల్స్ ఉండగా... తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ మాల్ ను వైజాగ్ లో ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ మాల్ ఏపీ నుంచి తెలంగాణకు తరలివచ్చింది.
Advertisement
Lulu MallHyderabad

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more