చంద్రబాబు దోషిగా తేలితే ఆరేళ్లు ఎన్నికలకు దూరం: విజయసాయిరెడ్డి
- విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
- నిర్దోషిగా తేలితే బయటకు వస్తారన్న వైసీపీ నేత
- లేదంటే ఎమ్మెల్యే పదవికి అనర్హులు అవుతారంటూ ‘ఎక్స్’లో పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నిన్న గాంధీ జయంతిని పురస్కరించుకుని జైలులో చంద్రబాబు, రాజమహేంద్రవరంలో ఆయన భార్య భువనేశ్వరి, ఢిల్లీలో లోకేశ్ సహా పలువురు నేతలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. మరోవైపు, ఇన్నర్ రింగురోడ్డు కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబు చేసుకున్న బెయిల్ దరఖాస్తుపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.