plant: ఈ మొక్కలు పెంచుకుంటే.. పురుగులు, దోమలు పరార్!

  • దోమలు, ఈగలు, పురుగులను ఆకర్షించే ప్రత్యేక మొక్కలు
  • అందుకోసం వీటికి ప్రత్యేకమైన రూపం
  • కార్నివోరస్ ప్లాంట్లు ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలమే
plants in your garden that eats mosquitoes and flys buigs

ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవడాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. పూల మొక్కలు, తులసి, మనీ ప్లాంట్ ఎక్కువ మంది ఇళ్లల్లో కనిపిస్తుంటాయి. పనిలో పనిగా మరికొన్ని మొక్కలను కూడా ఇంటి ఆవరణలో పెట్టడం ద్వారా పురుగులు, దోమల బెడద నుంచి కాస్త ఉపశమం పొందొచ్చు. 


కార్నివోరస్ ప్లాంట్స్ గురించి వినే ఉంటారు. అంటే మాంసాహార మొక్కలు. ఇప్పుడు నర్సరీలు వీటిని విక్రయిస్తున్నాయి. వీటిని కొనే వారు కూడా పెరుగుతున్నారు. వేళకు నీరు పోస్తూ, కొంచెం కేర్ తీసుకుంటే చాలు.. అవి బతికేస్తాయి. పురుగులను బలి తీసుకుంటాయి. 

బట్టర్ వోర్ట్
ఇవి తేమ వాతావరణంలో బతుకుతాయి. కనుక ఇంటి ఆవరణలో నీడ ఉండే చోట పెట్టుకోవచ్చు. ఆకులపై ఇవి మ్యూకస్ విడుదల చేస్తాయి. చిన్న చిన్న పురుగులు వచ్చి వాలగానే అతుక్కుపోతాయి. వాటిని ఈ మొక్క తింటుంది. 

 పిచ్చర్ ప్లాంట్
ఎండ ఎక్కువగా పడే చోట వీటిని పెట్టకూడదు. తరచూ నీటిని అందిస్తుండాలి. ఈ మొక్కకు పొడవాటి ట్యూబ్ లు వస్తాయి. అవి పురుగులు, దోమలను ఆకర్షిస్తాయి. తొట్టిలోకి దోమ, పురుగు వెళ్లిన వెంటనే అవి జీర్ణమయ్యే రసాలు విడుదల అవుతాయి. 

వీనస్ ఫ్లై ట్రాప్
నీటితో నింపిన ట్రేలో ఇది బతికేస్తుంది. ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ మొక్కకు రెండు చెక్కలతో కూడిన కాయ మాదిరిగా ఉంటాయి. అవి తెరుచుని, పురుగు వాలిన వెంటనే క్లోజ్ అవుతాయి. దాంతో పురుగులు, దోమలు, ఈగలు బందీ అవుతాయి. ఆ తర్వాత వాటిని తినేస్తుంది. 

 సరసేనియా
తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతుంది. తీర ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. దీనికి కూడా పొడవాటి ట్యూబులు ఉంటాయి. దీని చివర్లో తేనె మాదిరి మధురమైన పదార్థాన్ని మొక్క విడుదల చేస్తుంది. దాన్ని తినేందుకు వచ్చిన వాటిని మింగేస్తుంది.

డచ్ మ్యాన్ పైప్ 
ఈ మొక్కకు పువ్వులు విరివిగా కాస్తాయి. ఆ పువ్వులే పురుగులను ఆకర్షించి తినేస్తుంటాయి. పరాగ సంపర్కం ద్వారా పురుగులను ఆకర్షించి తినేస్తుంటుంది. ఈ మొక్కకు ప్రత్యేక సంరక్షణ అవసరం లేదు.

More Telugu News