మంత్రి జైశంకర్‌పై అమెరికా అధికారుల ప్రశంసల వర్షం!
- అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా మంత్రి జైశంకర్ గౌరవార్థం విందు ఏర్పాటు
- బైడెన్ ప్రభుత్వంలోని కీలక ఎన్నారై నేతలూ హాజరు
- ఇరు దేశాల మధ్య ఆధునిక బంధానికి జైశంకర్ రూపశిల్పి అంటూ ఎన్నారైల ప్రశంసలు
అమెరికా-భారత్ బంధం బలోపేతానికి ఎన్నారైలు ఎంతో కృషి చేశారని సీనియర్ దౌత్యవేత్త రిచర్డ్ వర్మ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య బంధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఆధునిక దౌత్య బంధానికి మంత్రి జైశంకర్ రూపశిల్పి అని కొనియాడారు. జైశంకర్ హయాంలో ఈ దౌత్య సంబంధాలు ఇనుమడించాయని పేర్కొన్నారు. ‘‘జైశంకర్ కృషి, నాయకత్వం వల్లే ఇప్పుడు మనం (అమెరికా, భారత్) ఈ స్థితిలో ఉన్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో అమెరికాలోని ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలపై జైశంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక బంధం బలోపేతాకి ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు వారధిగా నిలుస్తాయని చెప్పారు.