Rajinikanth: రజినీకాంత్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్న ‘లాల్ సలాం’.. 2024 సంక్రాంతికి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

  • ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం
  • విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా భారీ చిత్రం
  • ముంబయి డాన్ గా కీలక పాత్ర పోషిస్తున్న రజనీకాంత్
  • శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
Rajinikanth starring Lal Salam set release Sankranthi

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు.  ఇందులో ముంబయి డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీలకపాత్రలో న‌టిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో భారత క్రికెట్ దిగ్గజం క‌పిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు శరవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నట్లు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది. రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి. 

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ ‘‘సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌గారితో మా అనుబంధం కొన‌సాగుతుండ‌టం మాకెంతో ఆనందంగానూ, గ‌ర్వంగానూ ఉంది. మా రిక్వెస్ట్ మేర‌కు ఆయ‌న ఈ చిత్రంలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు’’ అని వెల్లడించారు. లాల్ సలాం చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News