ప్రధాని మోదీ కార్యక్రమాలకు ఈ సీఎం ఎందుకు రావడంలేదు?: కిషన్ రెడ్డి
- మహబూబ్ నగర్ సభ నుంచి అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం
- సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
- దేశంలో ఇలాంటి సీఎం ఎక్కడైనా ఉన్నాడా అంటూ విమర్శలు
- అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యలు
దేశంలో ఎక్కడైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? ప్రధాని వస్తే, ఆయన కార్యక్రమాలకు హాజరయ్యేంత తీరిక ఈ సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ ఓటు బ్యాంకు రాజకీయాలేనా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తే, సీఎం హాజరు కాకపోవడం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ సభలో ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.