సీఐడీ నోటీసులపై నారా లోకేశ్ స్పందన.. ఢిల్లీలో తాను ఎక్కడున్నదీ తెలిపిన వైనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఐడీ నోటీసులపై నారా లోకేశ్ స్పందన.. ఢిల్లీలో తాను ఎక్కడున్నదీ తెలిపిన వైనం

Nara Lokesh Response on CID notices
  • తాను ఎక్కడికీ పోలేదన్న నారా లోకేశ్
  • తనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపాటు
  • సీఐడీ నోటీసులు ఇస్తే తీసుకుంటానని వ్యాఖ్య
టీడీపీ యువనేత నారా లోకేశ్ గుర్తు తెలియని చోట దాక్కున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కామెంట్లపై లోకేశ్ ఘాటుగా స్పందించారు. తాను ఎక్కడికీ పోలేదని ఆయన చెప్పారు. సీఐడీ అధికారులు ఇంతవరకు తన వద్దకు రాలేదని... వాళ్లు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటానని తెలిపారు. దాక్కునే అలవాటు తనకు లేదని చెప్పారు. తాను ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నానో అందరికీ తెలుసని.. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 

తాను ఉంటున్న ప్రదేశాల అడ్రస్ లను కూడా లోకేశ్ వెల్లడించారు. ఇప్పుడు హోటల్ మౌర్యలో ఉన్నానని తెలిపారు. 50 అశోక రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉన్నానని చెప్పారు. అప్పుడప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి కూడా వెళ్తున్నానని వెల్లడించారు.
Advertisement
Nara Lokesh
Telugudesam
Delhi
CID

More Telugu News