అమ్మా, బ్రాహ్మణీ... ఆల్రెడీ మోత మోగించారు, ఇంకా భ్రమల్లో ఉన్నట్లున్నావు!: మంత్రి రోజా చురకలు
- మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకెళ్తే ప్రజల మద్దతు కోరుతావా? అని ప్రశ్న
- చంద్రబాబు మోసానికి 2019లోనే ప్రజలు మోత మోగించి, 23 సీట్లతో ఇంటికి పంపించారని ఎద్దేవా
- మంగళగిరిలో మీ భర్తకు మోత మోగించి ఓడించారని వ్యాఖ్య
- న్యాయవ్యవస్థకు అతీతులా? అని నిలదీత
'అమ్మ, మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకి వెళితే మీరేమో ఆ అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారు. మీ భర్త లోకేశ్‌కు మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..? మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ పోరాటాన్ని కాపీ కొట్టి పళ్ళాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫామిలీ అంతా కాపీ కొట్టడమేనా..?
నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారు. బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ చంద్రబాబు మీద చర్యలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా? అంటే మీరు కోర్టుల కంటే గొప్పోళ్లా ..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..? కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..?' అని ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.