భారత దౌత్యవేత్తను చంపాలంటూ గురుద్వారాలపై పోస్టర్లు
- తొలగించాలని ఆదేశించిన కెనడా అధికారులు
- లెక్క చేయని గురుద్వారాల నిర్వాహకులు
- ఇప్పటికీ కొన్ని చోట్ల దర్శనమిస్తున్న పోస్టర్లు
ఈ పరిణామం తర్వాత భారత దౌత్యవేత్తలను అంతం చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఇవి ఆన్ లైన్ లోనూ దర్శనమిచ్చాయి. గురుద్వారాల గోడలపై అంటించడం కూడా కనిపించింది. నిజ్జర్ హత్య ఘటన తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు మరింత వేడెక్కడం తెలిసిందే. భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందంటూ భారత సర్కారు నిరసన వ్యక్తం చేసింది.
దీంతో గురుద్వారాల వద్ద అంటించిన పోస్టర్లను తొలగించాలంటూ అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొన్నింటిని తొలగించి, కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా అలానే కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ గురుద్వారాల వెనుక గోడలపై ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. భారత దౌత్యవేత్తల ఫొటోలు వేసి, అంతం చేయాలంటూ దానిపై రాసి ఉంది. నిజ్జర్ ఫొటో సైతం పోస్టర్లలో ఉంది.