ఇతర రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు పని చేస్తోంది?: నారా బ్రాహ్మణి
- వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించిన నారా బ్రాహ్మణి
- స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగాల కల్పనలో ఏపీని చంద్రబాబు అగ్ర స్థానంలో నిలిపారని ప్రశంస
- వైసీపీ పుష్ ఔట్.. పుష్ ఇన్ పాలసీ వల్ల సంస్థలన్నీ తెలంగాణకు వెళ్తున్నాయని విమర్శ
స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లలో ఏపీని చంద్రబాబు అగ్ర స్థానంలో నిలిపి, మనందరం గర్వపడేలా చేశారని బ్రాహ్మణి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ 'పుష్ ఔట్.. పుష్ ఇన్' పాలసీ కారణంగా అమరరాజా నుంచి లులూ వరకు సంస్థలన్నీ ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోయాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై జాతీయ మీడియా 'ది ప్రింట్'లో వచ్చిన కథనాన్ని ఆమె షేర్ చేశారు.