ISRO: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. స్పందించిన ఇస్రో చీఫ్

isro chief responds over pragyan rover still not waking up from sleep mode
షార్ట్స్‌లో చూడండి
చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రముఖ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చీఫ్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. 

ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్‌ శాటిలైట్‌పై (ఎక్స్‌పోశాట్) ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎక్స్‌పోశాట్‌తో పాటూ ఇన్‌శాట్-3డీని కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టు వెల్లడించారు.
Go Back to Shorts
ISRO
Chandrayaan-3

More Telugu News