'అమరరాజా టు లులూ' కథనాన్ని ట్వీట్ చేసిన నారా లోకేశ్
- పెట్టుబడిదారులు కూడా భయపడుతున్నారన్న లోకేశ్
- ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడిదారులు కూడా జగన్ విధ్వంస నాయకత్వంలో సురక్షితంగా లేరన్న లోకేశ్
- అమరరాజా టు లూలూ అనే ది ప్రింట్ ఇంగ్లీష్ మీడియా కథనం ట్వీట్
అబుదాబీకి చెందిన లూలూ గ్రూప్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి నిష్క్రమించిన నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ మాల్‌ను ప్రారంభించిందని, ఇలా జరగడం ఈ ఒక్క ఇన్వెస్టర్ విషయంలోనే జరగలేదని ఆ కథనం పేర్కొంది. అమర్ రాజా బ్యాటరీస్, పేజ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు కూడా గత రెండేళ్లలో ఇదే బాట పట్టాయని అందులో తెలిపారు.