దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
- ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉండగా నేరుగా వెళ్లి కలిసేవాడినన్న మోత్కుపల్లి
- కేసీఆర్ పిలిస్తేనే బీఆర్ఎస్లోకి వెళ్లానని గుర్తు చేసిన నేత
- ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఆవేదన
- చంద్రబాబు అరెస్టుపై స్పందించకుంటే కేసీఆర్‌కే నష్టమని హెచ్చరిక
తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు గెలుపోటములను ప్రభావితం చేస్తారని, చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకుంటే ఆయనకే నష్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్లోకి తనంత తానుగా వెళ్లలేదని, కేసీఆర్ పిలిస్తేనే వెళ్లానని మోత్కుపల్లి గుర్తు చేశారు. ఆ తర్వాత తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వకుండా అవమానిస్తున్నారని అన్నారు.