Chandramukhi 2: ఆ ఇద్దరి ధాటిని తట్టుకోవడం కష్టమైంది: 'చంద్రముఖి 2' ప్రీ రిలీజ్ ఈవెంటులో కీరవాణి

Chandramukhi 2 Pre Release Event
షార్ట్స్‌లో చూడండి
లైకా ప్రొడక్షన్స్ వారు పి.వాసు దర్శకత్వంలో 'చంద్రముఖి 2' సినిమాను నిర్మించారు. టైటిల్ రోల్ ను కంగనా రనౌత్ పోషించగా, ఇతర ప్రధానమైన పాత్రలలో లారెన్స్ .. మహిమ నంబియార్ నటించారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు .. సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు.  

ఈ వేదికపై కీరవాణి మాట్లాడుతూ .. 'చంద్రముఖి 2' సినిమాలో దెయ్యాన్ని చూపించకుండానే వాసుగారు భయపెట్టేశారు. ఆయనతో కలిసి ఇంతకుముందు పనిచేశాను. కానీ లైకా .. లారెన్స్ .. కంగనాలతో కలిసి పనిచేయడం ఇదే ఫస్టు టైమ్. వాళ్లు చాలా గొప్పగా చేశారు. వాళ్ల కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది" అని అన్నారు. 

'చంద్రముఖి' సినిమాకి గురుకిరణ్ - విద్యాసాగర్ గారు సంగీతం పరంగా ఒక మార్కును సెట్ చేశారు. ఆ మార్కును తట్టుకుని నేను పనిచేయడం కష్టమైందనే చెప్పాలి. అయినా నా వంతు ప్రయత్నం చేశాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే ఆశిస్తున్నాను" అంటూ చెప్పారు. ఈ వేదికపై మహిమ నంబియార్ పాట పాడటం .. కంగనా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

Go Back to Shorts
Chandramukhi 2
Kangana Ranaut
Lawrence
Mahima
Vasu

More Telugu News