Chandrababu: ముగిసిన చంద్రబాబు సీఐడీ కస్టడీ

CID grills chandrababu naidu on second day
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఐడీ కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేతను... సీఐడీ కోర్టు ద్వారా రెండురోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. నిన్న, ఈ రోజు చంద్రబాబును 12 గంటలకు పైగా, 120 ప్రశ్నలు అడిగింది. నిన్న దాదాపు ఏడు గంటల పాటు సీఐడీ 50 ప్రశ్నలను సంధించింది. ఈ రోజూ సాయంత్రం గం.5 వరకు విచారించింది. కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సీఐడీ రెండు బృందాలుగా ఆయనను ప్రశ్నించింది.

కాగా, చంద్రబాబు రిమాండ్, కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ... న్యాయమూర్తిని కోరనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. చంద్రబాబును సీఐడీ అధికారులు వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు.
Go Back to Shorts
Chandrababu
cid
Andhra Pradesh

More Telugu News