యావత్ ప్రపంచానికి చైనా ముప్పుగా మారింది.. యుద్ధానికి సిద్ధమవుతోంది: నిక్కీ హేలీ
- అమెరికాను ఓడించేందుకు చైనా 50 ఏళ్లుగా వ్యూహాలు రచిస్తోందన్న నిక్కీ హేలీ
- చైనా సైన్యం ఇప్పటికే కొన్ని విషయాల్లో అమెరికాతో సమానంగా ఉందని వ్యాఖ్య
- చైనాను ఎదుర్కొనేందుకు బలం, ఆత్మాభిమానం అవసరమన్న నిక్కీ
తాను అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. శ్రామిక కుటుంబాల ఆదాయపు పన్నును తగ్గిస్తానని తెలిపారు. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను తొలగిస్తానని... దీంతో శత్రు దేశానికి మన దేశ ద్వారాలు మూసుకుపోతాయని చెప్పారు.