డైరెక్టర్ అట్లీపై నయనతార అసహనం.. షారుక్ ఖాన్ స్పందన ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డైరెక్టర్ అట్లీపై నయనతార అసహనం.. షారుక్ ఖాన్ స్పందన ఇదే!

Shahrukh Khan response on Nayanatara impatience
  • ఘన విజయం సాధించిన షారుక్, నయనతార చిత్రం 'జవాన్'
  • సినిమాలో తన పాత్రను తక్కువగా చూపించారని నయన్ అసంతృప్తి
  • నయన్ పాత్ర చాలా గొప్పగా ఉందన్న షారుక్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పటి వరకు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు అట్లీపై నయనతార అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో తన క్యారెక్టర్ ను తగ్గించి, దీపికా పదుకుణే క్యారెక్టర్ ను హైలైట్ చేశారని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

తాజాగా ఇదే అంశంపై షారుక్ స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా నయనతార అంశాన్ని ఒక నెటిజన్ ప్రస్తావించాడు. దీనికి షారుఖ్ సమాధానమిస్తూ... ఈ చిత్రంలో నయనతార పోషించిన సింగిల్ మదర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. అయితే నయనతారకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయిందని అయినప్పటికీ ఆమె పాత్ర చాలా గొప్పగా ఉందని అన్నారు.
Advertisement
Shahrukh Khan
Nayanthara
Atlee
Jawan

More Telugu News