అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్షకు కోట్ల మద్దతు, క్షీణిస్తున్న ఆరోగ్యం!
- నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల వద్ద అఖిల, జగద్విఖ్యాత రెడ్డి దీక్ష
- కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుజాతమ్మ, ఏరాసు ప్రతాప్ రెడ్డి సంఘీభావం
- షుగర్, బీపీ తగ్గుతున్నట్లు చెప్పిన డాక్టర్
24 గంటలు దాటిన దీక్ష
భూమా అఖిలప్రియ, జగద్విఖ్యాతరెడ్డిల నిరవధిక నిరాహార దీక్ష 24 గంటలు దాటింది. నిన్న సాయంత్రం వారు దీక్షకు కూర్చున్నారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యుడు డాక్టర్ నాగ సుమంత్ రెడ్డి తెలిపారు. షుగర్, బీపీ స్థాయులు తగ్గుతున్నట్లు తెలిపారు.