ప్రభాస్ ‘కల్కి’ సినిమా విషయంలో వైజయంతి మూవీస్ హెచ్చరిక
- ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా
- సెట్స్ నుంచి కొన్ని చిత్రాలు, ప్రభాస్ ఫొటోలు లీక్
- సోషల్ మీడియాలో షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరిక
దీంతో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. లీక్స్ బెడద తప్పించేందుకు కాపీరైట్ నోటీసును జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సన్నివేశాలు, మ్యూజిక్, ఫుటేజ్, స్టిల్స్, ఫొటోలు తదితర కాపీరైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులు కేవలం నిర్మాణ సంస్థకు మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇతర వ్యక్తులు ఈ సినిమా సీన్లు, ఫొటోలు, ఫుటేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుదని హెచ్చరించింది. కల్కి నుంచి ఏదైనా ఫొటోలు, వీడియోలతో పాటు సమాచారం, న్యూస్ ను లీక్ చేసినా సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో విడుదల చేసిన నోటీసులో స్పష్టం చేసింది.