Telangana: ‘దందాల తలసాని’.. ‘కన్నింగ్ కమలాకర్’ అంటూ మంత్రులపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్

  • అసెంబ్లీ ఎన్నికల ముంగిట జోరు పెంచిన రాష్ట్ర నాయకత్వం
  • సీఎం కేసీఆర్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు తీసుకుంటుందని ఆరోపణ
  • బీఆర్ఎస్ నాయకుల అవినీతి అంటూ 9 పాయింట్లతో ఛార్జ్ షీట్ల విడుదల
Congress comes with Chargesheet On BRS Ministers

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం జోరు పెంచింది.  సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తోంది. ప్రతి పని, ప్రాజెక్టుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ, 30 శాతం వాటా తీసుకుంటున్నారంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. బీఆర్ఎస్ మంత్రులపై ఛార్జ్ షీట్ వేస్తోంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ పై ఛార్జిషీట్లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇరువురు నేతలు చేసిన అక్రమాలు అంటూ ఇందులో 9 అంశాలను ప్రస్తావించింది. దందాల తలసాని అంటూ.. శ్రీనివాస్ యాదవ్ పై, కన్నింగ్ కమలాకర్ అంటూ గంగులపై పలు ఆరోపణలు చేసింది. 

మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్ యాదవ్ గతేడాది హోలీ వేడుక సందర్భంగా తన స్నేహితులతో కలిసి ఓ నటి కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. మరోవైపు గంగుల కమలాకర్ వక్ఫ్ భూములను ఆక్రమించారని ఛార్జ్ షీట్లలో పేర్కొంది. మంత్రి, ఆయన బంధువులు రూ. 750 కోట్ల పన్నులు ఎగవేశారని ఆరోపించింది. అంతకుముందు ‘మహా చెడ్డ మంచిరెడ్డి’ పేరిట ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీరుపైనా కాంగ్రెస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.

More Telugu News