కెనడాతో వివాదంలో భారత్‌కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు.. అమెరికా స్పష్టీకరణ
- భారత్-కెనడా దౌత్యవివాదంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ స్పందన
- వివాదంపై ఇరు దేశాలతో చర్చిస్తున్నామని వెల్లడి
- విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టీకరణ
- ఈ వివాదంలో భారత్‌కు ప్రత్యేక మినహాయింపులేవీ ఉండవని కామెంట్
‘‘ఈ అంశంపై ప్రైవేటుగా జరిగిన దౌత్య చర్చల లోతుల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. ఈ అంశంపై భారత్‌తో మేము ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని జేక్ సల్లివన్ పేర్కొన్నారు. కెనడా వివాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీతో మాట్లాడారా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
‘‘ఈ అంశంపై మాకూ ఆందోళన ఉంది. దీన్ని మేము తీవ్రంగానే పరిగణిస్తున్నాం. కేసుపై దృష్టిసారించాము. ఈ అంశంలో ఇండియాకు ప్రత్యేకమైన మినహాయింపు ఏదీ ఉండదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.