కొత్త పార్లమెంట్ భవనంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందన (వీడియో)
- పార్లమెంట్ భవనాన్ని సందర్శించిన హీరోయిన్లు
- సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఈ బిల్లు తోడ్పడుతుందన్న మిల్కీ బ్యూటీ
- కేంద్రం చొరవ అద్భుతమన్న నటి దివ్యా దత్తా
నటి దివ్యా దత్త కూడా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చొరవ అద్భుతమన్నారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగడం బాగుందన్నారు.
కాగా, ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు భూమిక పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా సందర్శించిన వారిలో ఉన్నారు.