మీ ఫోన్ ఒకేసారి పెద్దగా మోగితే.. భయపడొద్దు!
- పెద్ద రింగ్ సౌండ్ తో ఫోన్ వైబ్రేషన్
- ప్రయోగంలో భాగంగా సందేశాలు పంపిస్తున్న టెలికం శాఖ
- భయపడొద్దంటూ ఎస్ఎంఎస్ ద్వారా అప్రమత్తం చేసిన కేంద్రం
‘‘మీ మొబైల్ లో అత్యవసర పరిస్థితికి సంబంధించి టెస్ట్ సందేశాన్ని (ప్రయోగాత్మక సందేశాన్ని) భిన్నమైన శబ్దంతో, వైబ్రేషన్ తో అందుకోవచ్చు. దయచేసి భయపడకండి. ఇది నిజమైన అత్యవసర పరిస్థితిని సూచించదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సహకారంతో భారత టెలికం శాఖ ఈ సందేశాన్ని పంపిస్తోంది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ ట్రయల్ సందేశాన్ని పంపిస్తున్నాం’’అని ఎస్ఎంఎస్ రూపంలో అప్రమత్తం చేసింది. భవిష్యత్తులో అత్యవసర సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా టెలికం శాఖ ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.