kalyan ram: ‘డెవిల్‌’ నుంచి ఫస్ట్ మెలోడీ.. ఆకట్టుకునేలా కల్యాణ్ రామ్, సంయుక్త రొమాన్స్

kalyam ram and samyuktha imoresses in First single from devil Maaye Chesi
షార్ట్స్‌లో చూడండి
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ సినిమా ‘డెవిల్’. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త హీరోయిన్‌గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్‌ పాత్ర పోషించారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. 

'మాయే చేసి మెల్లగా.. మది దోచేసింది సిన్నగా.. చూపే చూసి సన్నగా’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్‌లో కల్యాణ్ రామ్, సంయుక్త వింటేజ్ లుక్‌లో కనిపించారు. ఇద్దరి మధ్య రొమాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు సత్య ఆర్.వి సాహిత్యం అందించారు. బృంద మాస్టర్ నృత్యం అందించింది. ఈ సినిమా  న‌వంబ‌ర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. 
Go Back to Shorts
kalyan ram
samyukta menon
devil
movie
Tollywood
pan idia

More Telugu News