జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది.. విడుదల చేసిన ఎన్టీఏ
- తేదీలను వెల్లడించిన జాతీయ పరీక్షల సంస్థ
- జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మెయిన్ తొలి విడత పరీక్షలు
- ఏప్రిల్ 1-15 మధ్య రెండో విడత పరీక్షలు
- నీట్ తప్ప మిగతావన్నీ ఆన్లైన్ విధానంలోనే
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది మే 5న నిర్వహించే నీట్ యూజీ-2024 ఫలితాలను జూన్ రెండోవారంలో ప్రకటిస్తారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు వెల్లడించిన తర్వాత ఎంసెట్ తదితర పరీక్షల తేదీలను వెల్లడిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి తెలిపారు.
కేంద్రీయ వర్సిటీల్లోని పీజీ సీట్ల భర్తీ కోసం మార్చి 11-28 మధ్య సీయూఈటీ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. యూజీ సీట్ల భర్తీ కోసం మే 15-31 మధ్య సీయూఈటీ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. పీహెచ్డీలో ప్రవేశాల కోసం జూన్ 10-21 మధ్య యూజీసీ నెట్ నిర్వహిస్తారు.