ఓ టెర్రరిస్ట్‌లా చంద్రబాబు అరెస్ట్... అందుకు జగన్ సంతోషించవచ్చు... కానీ...! వైగో
- చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రతీకారచర్య అన్న వైగో
- సమన్లు జారీ చేసి, విచారణ చేయవచ్చునని వ్యాఖ్య
- చంద్రబాబు అన్నింటినీ అధిగమించి బయటకు వస్తారని ఆశాభావం
టీడీపీ అధినేత అరెస్ట్ వైసీపీ ప్రతీకార చర్యకు నిదర్శనమన్నారు. రాజకీయ కారణాలతో ఆయనను అరెస్ట్ చేయడం పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతోషించవచ్చునని, కానీ ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను మాత్రం చెరిపివేయలేరన్నారు. చంద్రబాబు వీటన్నింటిని అధిగమించి తిరిగి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.