నిన్న తుక్కు గూడలో రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారు: విజయశాంతి
- సోనియా అంటే తనకెంతో అభిమానమన్న విజయశాంతి
- తెలంగాణ ప్రజలందరం ఆమెను గౌరవిస్తామని వెల్లడి
- బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని ఉద్ఘాటన
ఇక, నిన్నటి తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి సమర్థించారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవిభక్త కవలలు అని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, నిన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారని అన్నారు. మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయశాంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.