నిన్న తుక్కు గూడలో రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారు: విజయశాంతి

తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అంటే తనకెంతో అభిమానం అని వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చిన ఆమెను తెలంగాణ ప్రజలందరం తప్పక అభిమానిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆమెను గౌరవిస్తామని తెలిపారు. 

ఇక, నిన్నటి తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి సమర్థించారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవిభక్త కవలలు అని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, నిన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారని అన్నారు. మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయశాంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


More Telugu News