Reliance: ఏకంగా 11 భాషల్లో భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఫ్రీగా చూపించనున్న జియో సినిమా

  • ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ 
  • జియో సినిమాలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం
  • 2023-2028 వరకు భారత్ లో జరిగే మ్యాచ్ ల ప్రసార హక్కులు కొన్న వయాకామ్18
Reliance  JioCinema to stream India vs Australia ODI series free

భారత క్రికెట్ అభిమానులకు జియో సినిమా మరోసారి శుభవార్త చెప్పింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడే వన్డేల సిరీస్ ను ఉచితంగా ప్రేక్షకులకు అందించనుంది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసిన జియో సినిమా ఈ మేరకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22, 24, 27వ తేదీల్లో భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా, కీలకంగా మారనుంది. మరోవైపు 2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు భారత్ లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులను జియో కంపెనీకి చెందిన వయాకామ్18 సొంతం చేసుకుంది. 

భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారంతో ఐదేళ్ల కాలానికి ఈ హక్కులు మొదలవుతాయి. దాంతో, ఐపీఎల్ తరహాలో ఈ సిరీస్‌ను అందరికీ ఉచితంగా ప్రసారం చేయాలని జియో నిర్ణయించింది . మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో ఈ మ్యాచ్‌లను జియో సినిమా ప్రసారం చేయనుంది.

More Telugu News