స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 52 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 33 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • రెండున్నర శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్లు లాభపడి 67,519కి చేరుకుంది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 20,103 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.56%), టాటా స్టీల్ (1.66%), టెక్ మహీంద్రా (1.57%), నెస్లే ఇండియా (1.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.98%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.13%), ఐటీసీ (-0.75%), సన్ ఫార్మా (-0.38%), బజాన్ ఫిన్ సర్వ్ (-0.29%), భారతి ఎయిర్ టెల్ (-0.29%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News