తెలంగాణకు వర్ష సూచన... ఉత్తర జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
- నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
- శనివారం రాష్ట్ర మొత్తానికి అలర్ట్
ఉత్తర తెలంగాణ జిల్లాలకు రాబోయే మూడు రోజుల పాటు, మిగిలిన జిల్లాలకు శనివారం రోజుకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజులలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లో రాబోయే కొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.