Rules Ranjann: రామ్–బోయపాటితో పోటీ.. వెనక్కితగ్గిన కిరణ్ అబ్బవరం!

Rules Ranjann postponed to 6th October
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్‌ స్పీడ్‌లో ఉన్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కిరణ్, నేహాశెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్స్ రంజన్’. నిజానికి ఈ సినిమా అక్టోబర్‌లో రావాల్సి ఉంది. కానీ, రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా వాయిదా పడటంతో సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అదే రోజు రామ్–బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న స్కంద విడుదల అవుతోంది. దాంతో, రూల్స్ రంజన్ వారం వెనక్కి వెళ్లింది. 

అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెలాఖరుకు స్కంద సహా నాలుగు చిత్రాలు విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అమ్రిష్ గణేష్ సంగీతం అందించాడు.
Go Back to Shorts
Rules Ranjann
movie
kiran abbavaram
potineni ram
skanda
Boyapati Sreenu

More Telugu News