Ram: రెండు సినిమాల మధ్య తప్పని గట్టి పోటీ!

  • రామ్ హీరోగా రూపొందిన 'స్కంద'
  • కంగనా ప్రధాన పాత్రగా చేసిన 'చంద్రముఖి 2'
  • కంటెంట్ పరంగా పెరుగుతున్న అంచనాలు 
  • ఈ నెల 28వ తేదీనే ఈ రెండు సినిమాల రిలీజ్
Skanda and Chandramukhi 2 movies update

రామ్ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'స్కంద' సినిమా, ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాకి ఒక వారం ముందు కంగనా 'చంద్రముఖి 2' విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. దాంతో రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవుతూ ఉన్నాయి. దాంతో సహజంగానే ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీనే కనిపిస్తోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో, రామ్ సరసన నాయికగా శ్రీలీల నటించింది. బోయపాటి 'అఖండ'కి తమన్ ఏకాంతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడో తెలిసిందే. అదే తమన్ ఈ సినిమాకి పనిచేయడం అంచనాలు పెరగడానికి కారణమైంది. ఇక రామ్ - శ్రీలీల ఇద్దరూ డాన్సర్స్ కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక 'చంద్రముఖి 2'పై కూడా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కంగనా క్రేజ్ .. ఈ తరహా జోనర్లో లారెన్స్ కి ఉన్న అనుభవం ప్లస్ అవుతోంది. ఇక పి.వాసూకి ఈ కంటెంట్ పై ఎంత పట్టు ఉందనేది తెలిసిందే. కీరవాణి బాణీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందువలన అంచనాల పరంగా చూసుకుంటే, ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉందనే విషయం అర్థమవుతోంది.

More Telugu News